రైతులను మోసగిస్తున్న జగన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-04T06:18:12+05:30 IST

జగన్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

రైతులను మోసగిస్తున్న జగన్‌ ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న రామానాయుడు, తాతయ్యబాబు

మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, నియోజవకర్గ టీడీపీ ఇన్‌చార్జి తాతయ్యబాబు


బుచ్చెయ్యపేట, ఆగస్టు 3: జగన్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. వడ్డాదిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.49 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో 24 వేల మంది సభ్య రైతులు ఖరీఫ్‌ పెట్టుబడుల లేమితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కార్మికుల జీతాల బకాయిలు రూ.29 కోట్లు పేరకుపోవడంతో వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయన్నాయన్నారు. గత నెలలోనే బకాయిలు చెల్లిస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ హామీలు ఇచ్చి రైతులు, కార్మికులను మోసగించారన్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీతో సీఎం కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మశ్రీకి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని, దీన్నిబట్టి రైతులపై సీఎం జగన్‌ ఉన్న మక్కువ అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చెరకు బకాయిల చెల్లించాలని ఈ నెల 5న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీకి మెమొరాండం అందిస్తామని, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకలుఉ పాత్రుని సురేశ్‌, బి.శ్రీనివాస్‌, బొడ్డేటి గంగాధర్‌, రాజాన కొండనాయుడు, అడపా నరసింహమూర్తి, డొంకిన అప్పలనాయుడు, ఆర్‌.జోగినాయుడు, మత్సరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T06:18:12+05:30 IST