Abn logo
Sep 24 2021 @ 12:22PM

కోవిడ్ మృతులకు రూ. 50వేల పరిహారం.. ఏపీ ఇస్తుందా? లేదా?

అమరావతి: కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వేస్తూ కేంద్రం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. ఇక రాష్ట్రాలదే నిర్ణయం అని కేంద్రం అన్నంత మాత్రానా.. ఏపీ ప్రభుత్వం పరిహారం అందించడానికి ముందుకు వస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కోవిడ్ మృతుల సంబంధీకులకు రూ. 50వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది. గత రెండో వేవ్‌లలో మరణించిన వారితోపాటు భవిష్యత్‌లో కరోనాసోకి మరణించినవారందరికీ ఈ పరిహారం వర్తిస్తుందని చెప్పింది.


వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించాయి. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇస్తామన్న జగన్ సర్కర్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మరిప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఏ మేరకు విడుదల చేస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption