Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది: యనమల

అమరావతి: జగన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్‌ చిన్నాభిన్నం చేశాడని దుయ్యబట్టారు. రాజ్యాంగపరంగా అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరన్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో గవర్నర్‌తో నాలుగు మాటలు చెప్పించి.. సీఎం తనను పొగిడించుకునే కార్యక్రమం పెట్టబోతున్నాడని తప్పుబట్టారు. మార్చిలో ఎందుకు బడ్జెట్‌ సమావేశాలు పెట్టలేదు? అని ప్రశ్నించారు. జగన్‌కు చట్టసభలపై గౌరవం లేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

Advertisement
Advertisement