Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌ ఒక వృద్ధుడు.. ప్రజల్లో తిరగలేడు: చంద్రబాబు

తిరుపతి: సీఎం జగన్‌ ఒక వృద్ధుడు.. ప్రజల్లో తిరగలేడని, అందుకే వీడియో కాన్ఫరెన్స్‌లు పెడుతున్నాడని టీడీపీ నేత చంద్రబాబు ఎద్దేవాచేశారు. తిరుచానూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలగుంట భూముల కబ్జా.. ఆక్రమణలతో తిరుపతిని ఇప్పుడు ముంచారని దుయ్యబట్టారు. వైసీపీ పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే చెరువులు తెగేవా?అని ప్రశ్నించారు. తాము చెరువుల్ని ఆధునీకరించామని, మీలా ఆక్రమించలేదని చంద్రబాబు అన్నారు. 


వర్షాలు ఆగినా తిరుపతిలో ఇంకా కొన్ని కాలనీలు వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. లక్ష్మీపురం, అబ్బన్న కాలనీ, ఆటోనగర్‌, జీవకోన, కేశవాయనగుంట, మహిళా వర్సిటీ ఎదురుగా వున్న సరస్వతీ నగర్‌, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్‌, గాయత్రీ నగర్‌ ఇంకా నీటిలోనే వున్నాయి.వ్యాపార కేంద్రమైన ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో ఇంకా వరదనీరు వెల్లువలా పారుతూనే ఉంది.వర్షం వచ్చినప్పుడల్లా వారాల తరబడి వ్యాపారాలు ఆగిపోతే వేలకువేలు బాడుగలు ఎలాకట్టాలని వ్యాపారులు మధనపడుతున్నారు.

Advertisement
Advertisement