బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-17T19:24:15+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.

బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్‌ చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఆ ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమావేశానంతరం మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ తెలిపారన్నారు. అర్హుల పేర కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీని ప్రతినెలా వారికి ఇచ్చేలా ఆలోచనలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని ఆళ్ల నాని తెలిపారు.


Updated Date - 2021-05-17T19:24:15+05:30 IST