సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘కూ’లో చేరిన జగన్

ABN , First Publish Date - 2021-08-05T00:21:25+05:30 IST

ప్రజలతో నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు సీఎం జగన్.. భారతీయ మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ‘కూ’లో చేరారు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘కూ’లో చేరిన జగన్

అమరావతి: ప్రజలతో నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు సీఎం జగన్.. భారతీయ మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ‘కూ’లో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPOfficial), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో ఆంధ్రప్రదేశ్ (@AndhraPradeshCM), ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (@APDigitalCorp) వంటి అధికారిక అకౌంట్లు ‘కూ’లో ఏర్పాటయ్యాయి. కూ ద్వారా యూజర్లకు వారి వారి మాతృభాషల్లో తమ అభిప్రయాయాలు వ్యక్తీకరించవచ్చన్న విషయం తెలిసిందే. 


కాగా.. @Ysjagan హ్యాండిల్‌ ‌ఉపయోగించి జగన్ ప్రజలతో తెలుగు, ఆంగ్లంలో సంభాషిస్తారు. తన ప్రొఫైల్ నుంచి ఇటీవల జగన్  ఒక వీడియోను కూడా  షేర్ చేశారు. తరతరాలుగా ఉండే స్థిరమైన ఆసుపత్రులను నిర్మించాల్సిన అవసరం ఉందని జగన్ తెలియజేశారు. సీఎం జగన్‌తో యూజర్లు https://www.kooapp.com/profile/ysjaganలో కనెక్ట్ అవ్వచ్చు.


ఏపీ ప్రజలు తెలుగు, ఆంగ్లంలో ప్రభుత్వంతో సంభాషించాలని, ఇంటరాక్ట్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం జగన్ ఈ అకౌంట్‌ని  ప్రారంభించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వ శాఖల ‘కూ’ అకౌంట్లు ఓ ముఖ్య వేదికగా ఉపయోగపడనున్నాయి.

Updated Date - 2021-08-05T00:21:25+05:30 IST