Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎంలందరికీ జగన్ లేఖ రాశారు: సింఘాల్

అమరావతి: వ్యాక్సిన్ విషయంలో ఏపీ సహా తొమ్మిది రాష్ట్రాలు.. గ్లోబల్ టెండర్లు పిలిచినా బిడ్లు దాఖలు చేయలేదని  వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి సింఘాల్ తెలిపారు. ఏపీ నిర్వహించిన ప్రి-బిడ్ మీటింగులో వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల.. ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని చెప్పారు. వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకోవాల్సిన అవసరం ఉందని, సీఎంలందరికీ జగన్ లేఖ రాశారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో రెండు వారాల గడువిస్తామన్నారు. గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయని నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని తెలిపారు. ఈ లేఖలో రాజకీయ కోణం లేదని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. సీఎంలందరికీ జగన్‌ లేఖలు రాశారని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.


Advertisement
Advertisement