Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ‌గ‌న్ గాల్లోంచి నేల‌కు దిగు: లోకేష్

అమరావతి: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నార‌ని, నేల‌కు దిగితే జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ సూచించారు. రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందార‌ని మ‌నం చ‌రిత్ర పుస్త‌కాల‌లో చ‌దువుకున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు నీరోకి మ‌రో రూపమైన జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామ‌న్నారు. రాయ‌ల‌సీమ మొత్తం అకాల‌వ‌ర్షాల‌కు అల్ల‌క‌ల్లోల‌మైతే క‌నీసం అటువైపు క‌న్నెత్తి చూసే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌రెడ్డికి రాలేద‌ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాయ‌ల‌సీమ‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జ‌రిగింద‌ని తెలిపారు. భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని తెలిపారు. ఏం జ‌రిగిందో క‌నుక్కునే తీరిక లేని ముఖ్య‌మంత్రిని ఏమ‌నాలి? అని లోకేష్ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement