జగన్‌ మానసిక స్థితి బాగోలేదు: లోకేష్

ABN , First Publish Date - 2020-04-03T00:06:38+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదని, సీఎం జగన్‌ మానసిక స్థితి బాగోలేదని టీడీపీ నేత లోకేష్ ఎద్దేవాచేశారు. జగన్‌ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయని ఆరోపించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన వారంరోజులకే ఆర్థిక పరిస్థితి బాగాలేదని

జగన్‌ మానసిక స్థితి బాగోలేదు: లోకేష్

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదని, సీఎం జగన్‌ మానసిక స్థితి బాగోలేదని టీడీపీ నేత లోకేష్ ఎద్దేవాచేశారు. జగన్‌ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయని ఆరోపించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన వారంరోజులకే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేశారని, లాక్‌డౌన్‌తో పేదలు అల్లాడుతుంటే తన కాంట్రాక్టర్లకు రూ.6400 కోట్లు విడుదల చేశారని లోకేష్‌ ధ్వజమెత్తారు.


ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవని, రెండు విడతల్లో చెల్లిస్తానన్న జగన్‌... తన బినామీ కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో రూ.6400కోట్లు చెల్లించారని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-03T00:06:38+05:30 IST