Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారులతో జగన్‌ సమావేశం

అమరావతి: అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. నవంబర్‌ 14న తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్‌ సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు, జగన్‌కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలులు పోలవరం ప్రాజెక్టు బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్‌ బియ్యంలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement