జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-03T23:27:30+05:30 IST

ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు జగన్ కోరారు.

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు జగన్ కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టును జగన్ ఆశ్రయించారు. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే ప్రజా పాలనకు ఇబ్బందని, ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతున్నానని జగన్ తెలిపారు. తన వల్ల విచారణ జాప్యం జరుగుతోందన్న వాదనలో నిజం లేదని జగన్ అంటున్నారు. సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-12-03T23:27:30+05:30 IST