Abn logo
Sep 22 2021 @ 16:25PM

జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముంది: అశోక్‌బాబు

అమరావతి: ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టంలో లేకపోయినా టీటీడీ పాలకమండలిలో 50 మంది సలహాదారులను పెట్టారని తప్పుబట్టారు. టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముందని ధ్వజమెత్తారు. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయిందని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలు చేసిన హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సమాన్యులకు దర్శనం గగనమేనని చెప్పారు. లడ్డూల, టికెట్ల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని అశోక్‌బాబు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండిImage Caption