Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌రెడ్డి ఒక ఫేక్‌ ముఖ్యమంత్రి: చంద్రబాబు

అమరావతి: జగన్‌రెడ్డి ఒక ఫేక్‌ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అభ్యర్థులు కోర్టుకెళ్తే సీఎం, మంత్రులు జైలుకెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని తెలిపారు. ప్రశ్నించేవారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement