విద్యుత్ పరిస్థితులపై జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-18T22:49:05+05:30 IST

విద్యుత్ పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహంచారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.

విద్యుత్ పరిస్థితులపై జగన్‌ సమీక్ష

అమరావతి: విద్యుత్ పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహంచారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని జగన్ సూచించారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా.. అందుబాటులోకి వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.

Updated Date - 2021-10-18T22:49:05+05:30 IST