Abn logo
Aug 12 2021 @ 16:39PM

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కుపై జగన్‌ సమీక్ష

అమరావతి: వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో రికార్డులు అప్‌డేట్‌ కావాలని సూచించారు. డ్రోన్లు సహా ఇతర సామాగ్రి అవసరమైన మేర కొనుగోలు చేయాలని జగన్‌ ఆదేశించారు.