Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్వాక్రా మహిళల సొమ్మును దోచుకుంటున్న జగన్‌

తెలుగు మహిళలు ధ్వజం


ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 30 : రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు దాచుకుం టున్న సొమ్మును సీఎం జగన్‌ దోచుకుంటున్నారని తెలుగు మహిళలు విమర్శిం చారు. మంగళవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం మాట్లాడు తూ అభయ హస్తం పథకం కింద డ్వాక్రా మహిళలు దాచుకున్న కోట్ల రూపాయల డిపాజిట్‌లను స్వాహా చేసేందుకు జగన్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ మ హిళా అధ్యక్షురాలు రావుల పద్మజ మాట్లాడుతూ మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును ఎల్‌ఐసీ నుంచి సెర్ఫ్‌ సంస్థకు ప్రభుత్వం బదలాయించడం వాస్తవం కా దా అని ప్రశ్నించారు. ఆ డిపాజిట్‌లను ఏం చేస్తుందో స్పష్టత లేకపోవడం అన్యాయ మని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర క్యాదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, టి.అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement