రాజ్యాంగ విధ్వంసపాలనను అడ్డుకుందాం

ABN , First Publish Date - 2021-01-27T06:04:38+05:30 IST

సీఎం జగన్‌ రా జ్యాంగ విధ్వంసపాలన చేస్తున్నారని, దీనిని అడ్డుకుంనేం దుకు అందరూ ఏకంగా కావాలని టీడీపీ శ్రేణులు పిలుపు నిచ్చాయి.

రాజ్యాంగ విధ్వంసపాలనను అడ్డుకుందాం
చీరాలలో నిరసన వ్యక్తం చేస్తున్న యడం బాలాజీ తదితరులు

టీడీపీ శ్రేణులు పిలుపు

అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు


ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 26 : సీఎం జగన్‌ రా జ్యాంగ విధ్వంసపాలన చేస్తున్నారని, దీనిని అడ్డుకుంనేం దుకు అందరూ ఏకంగా కావాలని టీడీపీ శ్రేణులు పిలుపు నిచ్చాయి. మంగళవారం రాజ్యంగపరిరక్షణ పేరుతో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని హెచ్‌సీఎం వద్దగల అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థను కాపా డే వ్యక్తులకు కులాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ స్వాగతిస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభు త్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో ఎద్దు శశికాంత్‌భూషణ్‌, గుర్రాల రాజ్‌విమల్‌, నాళం నరసమ్మ, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, మహిళా కార్యదర్శి బీరం అరుణరెడ్డి, కా మేపల్లి శ్రీనివాసరావు, ఆర్ల వెంకటరత్నం, టి.అనంత మ్మ, నగర అధ్యక్షుడు కొఠారి శ్రీనివాసరావు, దాసరి వెంకటేశ్వ ర్లు, బండారు మదన్‌ తదితరులు పాల్గొన్నారు.

చీమకుర్తి : స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద రాజ్యాంగ పరిరక్షణదినం జరిపారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, గొట్టిపాటి రాఘవరావు, ఉన్నం సుబ్బారావు, గంగుల పార్వతి, కర్ణా ప్రసాద్‌, అవిశి నేని వెంగన్న తదితరులు పాల్గొన్నారు.

చీరాల: జగన్‌రెడ్డి సాగిస్తున్న రాజ్యాంగ విధ్వంస పాలనను అన్ని కోణాల్లో అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ కోరారు. రిపబ్లిక్‌డే  సంద ర్భంగా మంగళవారం బాలాజీ ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహి ంచి ముక్కోణపు పార్కు సెంటర్లోని  అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, గుద్దంటి చంద్రమౌళి, కోట సాంబశివరావు, పులి వెంకట్రావు, పాండు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T06:04:38+05:30 IST