శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో జగన్‌ విఫలం: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2022-01-02T23:14:02+05:30 IST

శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.

శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో జగన్‌ విఫలం: రాజాసింగ్‌

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని, మాజీ సీఎం వైఎస్‌ హయాంలో 426 జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి.. ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే ఇతర మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. హిందువుల తరపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్‌ను నియమించలేదని తప్పుబట్టారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌తో ముస్లింలు యధావిదిగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. సెక్యులర్ అంటే ఇదేనా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో హిందువులకు, గుళ్లకు రక్షణ లేదని రాజాసింగ్‌ తెలిపారు.

Updated Date - 2022-01-02T23:14:02+05:30 IST