పీయూష్‌ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపిన జగన్‌

ABN , First Publish Date - 2021-06-11T20:34:06+05:30 IST

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులు చర్చించారు.

పీయూష్‌ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపిన జగన్‌

ఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‎తో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్‎ను కోరారు. మరో 2 నెలలు ఉచిత బియ్యాన్ని పొడిగించినందుకు గోయల్‌కు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఉచిత రేషన్‌ బియ్యం కింద కేంద్రం.. ఏపీ పౌరసరఫరాలకు 3,229 కోట్ల బకాయి పడిందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరని జగన్‌ అన్నారు. 0.91 కోట్ల రేషన్‌ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని, కేటాయింపులను 1,54,148 మెట్రిక్‌ టన్నులకు తగ్గించారని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో హేతుబద్ధతలేని పరిమితి వల్ల.. పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్‌ పేర్కొన్నారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.



Updated Date - 2021-06-11T20:34:06+05:30 IST