Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపు కడప జిల్లాకు జగన్‌

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. అనూహ్యంగా కురిసిన వర్షాలకు పింఛా, అన్నమయ్య రిజర్వాయర్లకు గండిపడి కడప జిల్లాకు అపార ప్రాణ, ఆస్తినష్టం తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాలను తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తారని ప్ర భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌ ఈ నెల 20న వరద ప్రభావిత ప్రాంతాలైన చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపు రం జిల్లాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. అప్పుడు ఆయన బాధితులను నేరుగా కలసి పరామర్శించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై శాసనసభలో సీఎం వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.


ఇంతలో...ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కడప జిల్లా రాయచోటిలో వరద సాయం తీరుపై నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రాయచోటి పర్యటనలో ఉన్న సజ్జలనూ బాధితులు నిలదీశారు. ఏమైనా వరద సాయం అందాకే పర్యటిస్తానని సభలో చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు బాధితులను నేరుగా కలుసుకోవడానికి వెళుతుండటం గమనార్హం. 

Advertisement
Advertisement