Abn logo
Apr 9 2021 @ 03:28AM

గురుమూర్తిని గెలిపించండి

  • లబ్ధిదారులకు సీఎం లేఖలు


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు లబ్ధిదారులకు పేరుపేరునా లేఖలు రాశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ లేఖలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లేఖలో జగన్‌ వివరించారు. 22 నెలల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబానికి జరుగుతున్న లబ్ధిని వివరించారు. నవరత్నాలను ఈ లేఖలో ప్రస్తావించారు. 


Advertisement
Advertisement
Advertisement