Abn logo
Sep 9 2021 @ 17:24PM

జగన్ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు: లోకేశ్

గుంటూరు: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను వైసీపీ మోసం చేస్తోందని తెలిపారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్‌.. ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారున. జగన్ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. వైసీపీ మేలుకోవడం లేదని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని, దిశ చట్టం ద్వారా నిందితులను ఎందుకు శిక్షించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు.