మహిషాసుర మర్దినిగా జగన్మాత

ABN , First Publish Date - 2021-10-15T06:23:57+05:30 IST

దసరా పండుగ సందర్భంగా మండలంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు స్థానిక కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో, కనకదుర్గమ్మగుడి, పోలేరమ్మగుడి, దద్దాలమ్మ గుడిలో మహిషాసురమర్థనీదేవిగా దర్శనమిచ్చారు.

మహిషాసుర మర్దినిగా జగన్మాత

దర్శి, అక్టోబరు 14 : దసరా పండుగ సందర్భంగా మండలంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు స్థానిక  కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో, కనకదుర్గమ్మగుడి, పోలేరమ్మగుడి, దద్దాలమ్మ గుడిలో మహిషాసురమర్థనీదేవిగా దర్శనమిచ్చారు. స్థానిక వాసవీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో మహిళలు అమ్మవారికి చీర,సారె సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు. 

కనిగిరి : పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు ఈశ్వరీదేవి మాత భక్తులకు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. బాబా ఆలయంలో, బోయపాలెంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

పామూరు : దేవినవరాత్రులు వాసవీమాత దేవస్థానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.


Updated Date - 2021-10-15T06:23:57+05:30 IST