స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలి

ABN , First Publish Date - 2021-10-21T05:00:58+05:30 IST

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్తాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలి
వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న హోంమంత్రి, కలెక్టర్‌

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభం

గుంటూరు(తూర్పు), అక్టోబరు 20: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్తాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలను బుధవారం ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో కలసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నెలకు రూ.60 వసూలు చేసి వాళ్ల గ్రామాల్లో వారి పారిశుధ్యాన్ని వారే నిర్వహించుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో రోజు 2500 టన్నుల చెత్తను సేకరించి వాటి ద్వారా విలువైన ఆదాయం పొందడానికి అవకాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తొలిసారిగా గుంటూరుతో పాటు వైజాగ్‌ వంటి నగరాల్లో చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగరమేయర్‌ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, మిర్చియార్డు చైర్మన చంద్రగిరి ఏసురత్నం, జేసీలు దినేష్‌కుమార్‌, రాజకుమారి, శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ సజీలా, డీపీవో కేశవరెడ్డి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T05:00:58+05:30 IST