జగనన్న విద్యా దీవెన అర్హులందరికీ అందిస్తాం

ABN , First Publish Date - 2021-07-30T04:30:47+05:30 IST

జగనన్న విద్యా దీవెన పథకం సాంకేతిక కారణాల వల్ల గానీ, లేక ఇతర కారణాల వల్ల గానీ అర్హులైన వారికి అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరోసారి పరిశీలించి అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

జగనన్న విద్యా దీవెన అర్హులందరికీ అందిస్తాం
జగనన్న విద్యా దీవెన చెక్కును విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే కాకాణి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి  


వెంకటాచలం, జూలై 29 : జగనన్న విద్యా దీవెన పథకం సాంకేతిక కారణాల వల్ల గానీ, లేక ఇతర కారణాల వల్ల గానీ అర్హులైన వారికి అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరోసారి పరిశీలించి అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్యే  కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నియోజక వర్గానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకం కింద 5,712 మంది విద్యార్థులకు విడుదలైన ఆర్థిక సహాయం రూ.3,99,72,200ల చెక్కును విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గానికి జగనన్న విద్యా దీవెన కింద రూ.18,05,55,000ను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు.   అనంతరం రెవెన్యూ సమస్యలపై తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌తో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో మందల వెంకట శేషయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, షేక్‌ షజహన్‌, వెలుబోయిన వెంకటేశ్వర్లు తదితరులున్నారు.   

Updated Date - 2021-07-30T04:30:47+05:30 IST