‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’

ABN , First Publish Date - 2021-05-14T08:16:06+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. వీటికి... ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ అని పేరు పెట్టారు. ఇలా ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన రెండు ఆర్టీ

‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ పడకలు

రాజమండ్రిలో రెండు బస్సులు ప్రారంభం

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 13: ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. వీటికి... ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ అని పేరు పెట్టారు. ఇలా ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన రెండు ఆర్టీసీ వెన్నెల ఏసీ బస్సులను గురువారం ఎంపీ భరత్‌ రామ్‌ ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ సరిపోని పరిస్థితి నెలకొందని, బెడ్స్‌ దొరికేలోగా బాధితులకు కనీసం రెండు మూడు గంటలైనా ఆక్సిజన్‌ సరఫరా చేయాలనే లక్ష్యంతో ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ ప్రారంభించామన్నారు. ఒక్కో వెన్నెల బస్సులో 20 మందికి చికిత్స అందించవచ్చునని... ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

Updated Date - 2021-05-14T08:16:06+05:30 IST