Abn logo
Oct 29 2020 @ 19:25PM

ఆ రెండింటిలోనూ నిజం లేదు: జగపతిబాబు

Kaakateeya

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'క‌ల‌ర్ ఫొటో'. ఈ చిత్రం అక్టోబర్‌ 23న ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. వర్ణ వివక్ష నేపథ్యంలో న్యాచురల్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. మాస్‌ రాజా రవితేజ, విజయ్‌ దేవరకొండ, నేచురల్‌ స్టార్‌ నాని, సాయితేజ్‌, విష్వక్సేన్‌, మారుతి  వంటి వారు ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. 


''కలర్‌ఫొటో.. సినిమా చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను. దర్శకుడు సందీప్‌ పనితనం చాలా బాగుంది. తనని తాను నిరూపించుకున్నాడు. సుహాస్‌ మంచి నటుడిగానే కాదు.. హీరోగానూ ప్రూవ్‌ చేసుకున్నాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాలబైరవ ఇచ్చిన సంగీతం నన్ను బాగా ఆకట్టుకుంది. సినిమాని హిట్‌ చేసేది మనీ, స్టార్‌ డమ్‌ మాత్రమే కాదని ఈ చిత్రం రుజువు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకుని కూడా సాధ్యం చేయవచ్చని నిరూపించింది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కలిసి క్రియేటివిటీగా, సహజసిద్ధంగా ఇటువంటి సినిమాలు తీయడం చూస్తూ.. నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి సినిమాలలో భాగం అవ్వడం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే.. చిన్న హీరోల సినిమాలో నేను ఇలాంటి పాత్ర చేయనని, అలాగే నాకు రెమ్యూనరేషన్‌ ఇచ్చుకోలేరని వారు ఇటువంటి సినిమాలకు నన్ను సంప్రదించడం లేదు. ఈ రెండింటిలో నిజం లేదు. ఇలాంటి పాత్రలతో యంగ్‌ స్టర్స్‌ వస్తే చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.." అని జగపతిబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.




Advertisement
Advertisement