Jun 11 2021 @ 17:47PM

నూతన వ్యాపారంలోకి జగ్గూభాయ్‌!


జగపతిబాబు మహిళల అభిమాన నటుడు. ఇప్పటికీ ఆయనకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అలాగే ఉంది. ఓ దశలో ఆయన వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరో పాత్రలను కాస్త పక్కకు జరిపి.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆయన ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సక్సెస్‌ఫుల్‌ జర్నీని కొనసాగిస్తున్నారు. నటనతోపాటు ఆయన ఓ వ్యాపారంలోకి దిగనున్నారు. ఇతరుల భాగస్వామ్యంతో ఆయన కూడా ఓ డైరెక్టర్‌గా జూబ్లీహిల్స్‌లో ఓ ఆయుర్వేదం ఆసుపత్రిని త్వరలో జగపతిబాబు ప్రారంభించనున్నారట. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి బిల్డింగ్‌ రెనోవేషన్‌ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. అయితే ఉన్నట్టుండి జగపతిబాబు ఆయుర్వేదం వైపు మళ్లడానికి కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుకు జగపతిబాబు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే!