Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 25 2021 @ 16:05PM

సారీ చెప్పిన జగ్గారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వివాదం ముగిసింది. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. శుక్రవారం ఘటనపై జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. ‘‘నిన్నటి ఘటనను మరిచిపొండి. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం నా తప్పే. నా వైపు నుంచి తప్పు జరిగింది.. మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చా. మీడియా ముందు మాట్లాడొద్దని ఠాగూర్, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ సూచన చేశారు. మాది అన్నదమ్ముల పంచాయితీ లాంటిది. ఏఐసీసీ అధ్యక్షులు సోనియా, రాహుల్ డైరెక్షన్‌లో పనిచేస్తా. మా యుద్ధం టీఆర్ఎస్, బీజేపీ పైనే’’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.



జగ్గారెడ్డి శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తొలుత సీఎల్పీ భేటీలోనూ, ఆ తరువాత మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగానూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ ప్రొటోకాల్‌ పాటించడంలేదని, ఆయన పీసీసీ చీఫ్‌ కావడానికి ముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేనని తెలిపారు. సంగారెడ్డికి వస్తే  తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. అసలు చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని, కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీయా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

Advertisement
Advertisement