Abn logo
Jun 25 2021 @ 19:16PM

బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్: లాకప్‌డెత్‌‌లో మరణించిన మరియమ్మ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతల్లా తాము రాత్రిపూట వెళ్లి టీఆర్‌ఎస్‌ నేతల్ని కలవలేదని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని తాము నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కొందరు పోలీసులు కావాలనే దళితులపై దాడులు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.