ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్‌ ఆలోచనలో మార్పు తథ్యం

ABN , First Publish Date - 2021-11-30T05:38:47+05:30 IST

శాసనమండలి స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్‌ జిల్లా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వస్తుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్‌ ఆలోచనలో మార్పు తథ్యం
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


జహీరాబాద్‌, నవంబరు 29: శాసనమండలి స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్‌ జిల్లా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వస్తుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని పోటీకి నిలపడంతోనే టీఆర్‌ఎస్‌ స్థానిక నేతలకు గౌరవం పెరిగిందన్నారు. ఇంతకుముందు మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ స్థానిక నేతలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చేవారే కాదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో నిలుపడంతో వారందరికీ స్వయంగా ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టూర్లు తిప్పడానికి హరీశ్‌రావు సిద్ధమయ్యారని విమర్శించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రమంతటా స్థానిక సంస్థల ప్రతినిధులకు మంచిరోజులు వస్తాయన్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రె్‌సకు 8మంది ఎమ్మెల్యేలు ఉండేవారని.. ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సకు 8 మంది, కాంగ్రె్‌సకు ఒక్కరు ఉన్నారని  గుర్తుచేశారు. భవిష్యత్తులో మాత్రం టీఆర్‌ఎ్‌సకు రెండు సీట్లు, మిగిలినవి  కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 230 ఓట్లు ఉన్నాయని, టీఆర్‌ఎస్‌ నేతలేవరైనా కలిసివస్తే వారితో కూడా ఓటు వేయించాలని ప్రజాప్రతినిధులను కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మదన్‌మోహన్‌రావు, గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ వివిధ మండలాలు, పట్టణాలు, బ్లాక్‌ల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T05:38:47+05:30 IST