నన్ను పిలవకపోవడంపై అనుమానం కలుగుతోంది: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-11-13T22:26:44+05:30 IST

ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

నన్ను పిలవకపోవడంపై అనుమానం కలుగుతోంది: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేఖ రాశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అయిందని ఆయన పేర్కొన్నారు. హుజురాబాద్ బై పోల్ సమీక్షకు తనను పిలువకపోవడంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంఛార్జిగా ఉన్న తనకు ఆహ్వానించకపోవడం పై అనుమానం కలుగుతోందిని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు నెలలకు ముందే వెంకట్‌ను అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదన్నారు. స్థానిక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదన్నారు. వెంకట్‌కు ఆర్థిక బలం లేదన్న వాస్తవం రేవంత్’కు, భట్టికి ఇద్దరికి తెలుసున్నారు. అయినా వారిద్దరూ వెంకట్‌కు ఆర్థిక సహాయం ఎందుకు చేయలేదన్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయిందని, దీనికి బాధ్యులు ఎవరన్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు.


ఇవే ప్రశ్నలు తాను పీఏసీ సమావేశంలో లేవనెత్తానన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను మీడియాలో మాట్లాడితే కొందరు తప్పుపట్టారన్నారు. ఈ రోజు ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న విషయాలు ఎలా బయటకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. వార్ రూమ్ విషయాలు ఇలా బయటకు చెప్పడం కరెక్టా అని ఆయన నిలదీశారు. 




Updated Date - 2021-11-13T22:26:44+05:30 IST