Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగ్గయ్యపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోసారి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. పోలీసులు, పోలింగ్ సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారు. వైసీపీ నేతలకు కౌంటింగ్ సెంటర్‌లో రాచమర్యాదలు చేస్తున్నట్లు సమాచారం. తొలుత 13వ వార్డులో 5 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. నాలుగు సార్లు రీ కౌంటింగ్ అనంతరం వైసీపీ గెలిచిందని ప్రకటించారు. పొటా... పోటీగా టీడీపీ వర్సస్ వైకాపా పార్టీలు పోటీపడుతున్నాయి. సింగిల్ డిజిట్‌లో గెలిచిన టీడీపీ వార్డులను వైసీపీ నేతల ఒత్తిడి తో రి కౌంటింగ్ నిర్వహించారు. వైసీపీ వార్డుల్లో సింగిల్ డిజిట్‌తో గెలిచిన వారిని టీడీపీ రికౌంటింగ్ కోరితే అధికారులు తిరస్కరిస్తున్నారు. వైసీపీ నాయకులు తీరుపై సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement