Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లికి ఉరివేసి....ఆత్మహత్య చేసుకున్న ఇరిగేషన్ ఉద్యోగి

జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది.  ఆనంద రెడ్డి(43) అనే వ్యక్తి...మంచానికే పరిమితమైన తన తల్లికి ఉరివేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆనందరెడ్డి మృతి చెందగా.. తల్లి విజయ ప్రాణాలతో బయటపడింది. మృతుడు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని ఇరిగేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆనందరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement