జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణం

ABN , First Publish Date - 2020-10-25T18:00:23+05:30 IST

జగిత్యాల : జిల్లాలోని మెట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణం

జగిత్యాల : జిల్లాలోని మెట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం చేసి ఈ దుశ్చర్యను కామాంధులు వీడియో తీశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కొద్దిరోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలుసుకున్న ఆ మృగాళ్లు సొంతూరి నుంచి పరారయ్యారని తెలియవచ్చింది. వారి కోసం రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-25T18:00:23+05:30 IST