Abn logo
Sep 26 2021 @ 23:39PM

నేర ప్రవృత్తిని విడనాడాలి : ఎస్పీ

జాగృతి కార్యక్రమంలో స్టాల్స్‌ పరిశీలిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 26: ప్రలోభాలు, చెడువ్యసనాల కారణంగా నేరాలకు అలవాటు పడతారని, నేరప్రవృత్తిని విడనాడి మెరుగైన జీవనోపాధి కొనసాగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు. దండమూడి కల్యాణ మండపంలో జాగృతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సబ్‌ డివిజన్‌ పరిధిలోని సారా తయారీ, విక్రయదారులు, చెడు నడక కల్గిన వారికి శిక్షణ ఇచ్చి ఎలక్ట్రిక్‌ వర్క్‌, వెల్డింగ్‌ వర్క్‌, కుట్టు పనులు, చేతి వృత్తులు, మెకానిక్‌ వర్క్స్‌, ప్లంబింగ్‌, ఫోటో ఫ్రేమ్‌ వర్క్స్‌ మొదలైన వృత్తులకు సంబందించి 15 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సమాజంలో నేరస్థులుగా ముద్రపడిన వారికి కుటుంబ బాధ్యతలు తెలియజేస్తూ, చట్టాలపై అవగాహన కల్పించి సన్మార్గంలో నడి పించడం జాగృతి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ సి.జయరా మరాజు, కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌, సీఐ గౌరీ శంకర్‌, సిబ్బంది, మహిళ పోలీసులు పాల్గొన్నారు.