జైజై గణేష

ABN , First Publish Date - 2022-08-28T04:59:40+05:30 IST

మరో మూడ్రోజుల్లో గణేష్‌ ఉత్స వాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు తమకు నచ్చిన గణనాథులను బుక్‌ చేసుకోవడంతో పాటు మండపాలను ముస్తాబు చేస్తున్నారు.

జైజై గణేష

జైజై గణేష

- ఉత్సాహం చూపుతున్న యువకులు  

- పెద్దఎత్తున కొనుగోలవుతున్న గణనాథులు

-  పాలమూరులో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు

- భారీ విగ్రహాల కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న నిర్వాహకులు

మహబూబ్‌నగర్‌/అచ్చంపేట/నారాయణపేట, ఆగస్టు27: మరో మూడ్రోజుల్లో గణేష్‌ ఉత్స వాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు తమకు నచ్చిన గణనాథులను బుక్‌ చేసుకోవడంతో పాటు మండపాలను ముస్తాబు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో రెండేళ్లు గా కళ తప్పినా వేడుకలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని యువకులు ఉత్సా హం చూపుతున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి సంబురాలకు వారం నుంచే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో యువత పోటీపడి మండపాలను ముస్తాబు చే స్తున్నారు. గతంలో పాలమూరు పట్టణంలో ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ఉత్సవ సమితి తొమ్మిది రోజులు వేడుకలు నిర్వహించాలని  నిర్ణయించారు. జిల్లాలో 10 ఫీట్ల ఎత్తుగల విగ్రహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల తరువాత ఉత్సవాలు నిర్వహిస్తున్నందున భారీ విగ్రహాల కోసం యువత హైదరాబాద్‌ నుంచి తీసు కువస్తున్నారు.  పర్యావరణ పరిరక్షణకోసం మట్టి గణపతులనే ఏర్పాటు చేయాలన్న ప్రచారం బాగా జరుగుతుండటంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. చాలామంది వాటినే పూజిస్తున్నారు. జిల్లాకేంద్రంలో శివశక్తినగర్‌, బండ్లగేరి, టీడీగుట్ట, గడియారం చౌరస్తాలో మట్టిగణపతులను భారీ సంఖ్యలో విక్రయిస్తున్నారు. అడుగు నుంచి ఏడు అడుగుల ఎత్తు వరకు మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.  జిల్లాకేంద్రంలో 500, గ్రామాల్లో 1500 వరకు మండ పాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  రాజస్థాన్‌ నుంచి వచ్చిన కళాకారులు పాలమూరుతో పాటు జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో పెద్దఎత్తున పీఓపీ విగ్రహాలను ఆకర్శణీయంగా తయారుచేస్తున్నారు.. రూ. 5 వేల నుంచి 50 వేల వరకు వీటి ధరలు ఉన్నాయి. 

అచ్చంపేట నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో  వినాయక ఉత్సవాలు సందడి కనిపించడంలేదు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో 10 తయారీ కేంద్రాలలో దాదాపు 1,200 విగ్రహాలకు పైగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇవే కాక ముంబయి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకువచ్చి విక్రయానికి పెట్టారు. 

నారాయణపేట పట్టణంలోని పలు దుకాణాల్లో వినాయక విగ్రహాలను ఇప్పటికే విక్ర యానికి సిద్ధంగా ఉంచారు. పలువురు తయారీ దారులు విగ్రహాలను ఇళ్లలోనే విక్రయిం చేందుకు ఉంచారు. విభిన్న ఆకృతులతో విగ్రహాలను సిద్ధంగా ఉంచారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన వినాయక సంఘాలు వచ్చి అడ్వాన్సులు చెల్లించి వినాయక విగ్రహాలను బుక్‌ చేసుకొని వినాయక చవితి రోజు తమ ప్రాంతాలకు తరలించనున్నారు. వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు నిర్వాహకులు దృష్టి సారించడంతో వినాయక విగ్రహాల దగ్గర కొనుగోలు దారుల బుకింగ్‌ సందడి నెలకొంది. 




Updated Date - 2022-08-28T04:59:40+05:30 IST