Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 11 2021 @ 08:28AM

IAS toppers: టీనాదబీ, అథర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరు

జైపూర్ ఫ్యామిలీ కోర్టు నిర్ణయం 

జైపూర్ (రాజస్థాన్): ఐఎఎస్ టాపర్లు అయిన టీనా దబీ,అథర్‌ఖాన్‌లకు జైపూర్ ఫ్యామిలీ కోర్టు ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. గత ఏడాది టీనాదబీ, అథర్‌ఖాన్‌లు విడాకులు కోరుతూ జైపూర్ కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్లు సమర్పించారు. 2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో టాపర్ అయిన టీనా దబీ, అథర్ ఖాన్ లు గతంలో ఒకరినొకరు ప్రేమించుకొని, వివాహం చేసుకున్నారు. టీనా దబీ ఫస్ట్ ర్యాంకర్ కాగా, కశ్మీరుకు చెందిన అథర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు.

 రాజస్థాన్ కేడర్ ఐఎఎస్ అధికారులైన ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత జైపూర్ ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. టీనాదబీ, అథర్ ఖాన్ ల వివాహానికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు హాజరై అభినందించారు.కాగా ఐఎఎస్ టాపర్ల ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ అని హిందూమహాసభ ఆరోపించింది. 

Advertisement
Advertisement