Advertisement
Advertisement
Abn logo
Advertisement

జైపూర్ T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

జైపూర్: స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న T20 మ్యాచ్ టాస్ టీమిండియా గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్‌ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా... రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా భారత T20 జట్టు ఈ మ్యాచ్‌తో కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది. పొట్టి ఫార్మాట్‌ సారథ్యం నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌ను కెప్టెన్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఇక కోచ్‌గా ద్రవిడ్‌ కూడా రవిశాస్త్రి స్థానంలో నూతన బాధ్యతలు స్వీకరించాడు. అలాగే సీనియర్ల విశ్రాంతితో పలువురు యువ ఆటగాళ్లకు జట్టులో తొలిసారి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ అందరికీ సవాల్‌గా నిలిచింది.

Advertisement
Advertisement