జైపూర్‌లో వింత చోరీ... దుకాణం బ్యాక్ డోర్ నుంచి వచ్చి....
ABN , First Publish Date - 2020-06-04T12:48:52+05:30 IST
లాక్‌డౌన్ 5.0లో అక్కడక్కడా దొంగతాలు చోటుచేసుకుంటున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని హర్మాడా ప్రాంతంలో ఒక వింత చోరీ జరిగింది. హర్మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని...
జైపూర్: లాక్‌డౌన్ 5.0లో అక్కడక్కడా దొంగతాలు చోటుచేసుకుంటున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని హర్మాడా ప్రాంతంలో ఒక వింత చోరీ జరిగింది. హర్మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక స్వీట్స్ షాపులో దొంగతనం జరిగింది. దొంగలు దుకాణంలో ఉంచిన నగదుతో పాటు అక్కడ ఉంచిన స్వీట్లను కూడా తీసుకుపోయారు. ఉదయం దుకాణం తెరిచాక చోరీ జరిగినట్లు గుర్తించామని దుకాణం యజమాని సుమిత్ సైనీ తెలిపారు. తాను దుకాణానికి వెళ్ళినప్పుడు బ్యాక్ డోర్‌లాక్ పగలగొట్టివుందని, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు. దొంగలు దుకాణంలోని ఖరీదైన స్వీట్లను ట్రేలలో నుంచి తీసి, ఖాళీ బాక్సులలో నింపుకొని తీసుకుపోయారని సుమిత్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.