కొవిడ్ ఎఫెక్ట్: ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని పొడిగించిన జార్ఖండ్

ABN , First Publish Date - 2021-06-23T05:10:23+05:30 IST

పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ..

కొవిడ్ ఎఫెక్ట్: ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని పొడిగించిన జార్ఖండ్

రాంఛీ: పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి తీవ్ర కొరత ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం వైద్యులకు తీవ్ర కొరత నెలకొంది. నాన్ టీచింగ్ కేడర్‌లో మంజూరైన మొత్తం 2,316 పోస్టులకు గానూ 1,597 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇక టీచింగ్ కేటగిరీలో మంజూరైన మొత్తం 591 పోస్టులకు గానూ 285 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T05:10:23+05:30 IST