ఇంకా ఏం ఆడతావ్‌..

ABN , First Publish Date - 2020-06-20T08:26:06+05:30 IST

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై సహచర ఆటగాడు, ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తండ్రి జాన్‌ జొకోవిచ్‌ మండిపడ్డాడు. నలభై ఏళ్లకు దగ్గరపడుతున్నా.. అతనింకా ఆటలో కొనసాగడమేంటని ప్రశ్నించాడు. ప్రత్యర్థులు

ఇంకా ఏం ఆడతావ్‌..

బెల్‌గ్రేడ్‌: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై సహచర ఆటగాడు, ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తండ్రి జాన్‌ జొకోవిచ్‌ మండిపడ్డాడు. నలభై ఏళ్లకు దగ్గరపడుతున్నా.. అతనింకా ఆటలో కొనసాగడమేంటని ప్రశ్నించాడు. ప్రత్యర్థులు జొకోవిచ్‌, నడాల్‌ తనకంటే మెరుగైన ఆటగాళ్లవుతున్నారన్న నిజాన్ని జీర్ణించుకోలేకే రోజర్‌ ఈ వయసులోనూ టెన్నిస్‌ ఆడుతున్నాడని జాన్‌ విమర్శించాడు. ‘అతను (రోజర్‌) ఇంకా ఎందుకు ఆడుతున్నాడు? 40 ఏళ్ల వ్యక్తి హాయిగా ఇంట్లో కూర్చొని చేసేందుకు చాలా పనులు ఉంటాయి. కానీ, అతను మాత్రం ఈ వయసులోనూ రాకెట్‌ను వదలడం లేదు. వెళ్లవయ్యా.. ఇంటికెళ్లి నీ పిల్లలను పెంచుకో, స్కీయింగ్‌ చెయ్‌, ఇంకేదైనా చేసుకో. జీవితమంతా టెన్నిసే కాదు.. అది నా కొడుకు (జొకోవిచ్‌)కు ప్రస్తుతం హాబీ మాత్రమే’ అని ఫెడరర్‌పై జాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్విస్‌స్టార్‌, 38 ఏళ్ల రోజర్‌ ఫెడరర్‌ రికార్డుస్థాయిలో 20 గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-06-20T08:26:06+05:30 IST