‘జల జీవన్‌ మిషన్‌’పై 16న ఆంధ్రతో జలశక్తి శాఖ భేటీ

ABN , First Publish Date - 2021-04-09T07:36:25+05:30 IST

కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని

‘జల జీవన్‌ మిషన్‌’పై 16న ఆంధ్రతో జలశక్తి శాఖ భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలతో శుక్రవారం నుంచి జలశక్తి శాఖ కసరత్తు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో ఈ నెల 16న ఉదయం పదిన్నర నుంచి 12గంటల మధ్య సంప్రదింపులు జరుపుతుంది. అలాగే తెలంగాణ అధికారులతో ఈ నెల 28న కసరత్తు నిర్వహిస్తుంది. ఈ మిషన్‌కు రూ.లక్ష కోట్ల పైచిలుకు ఖర్చుచేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2021-04-09T07:36:25+05:30 IST