టీఆర్‌ఎస్‌కు జలక్‌

ABN , First Publish Date - 2022-09-22T05:39:41+05:30 IST

మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె స్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మొదట్లో హడావుడి చేసినా నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక ల సందడి కొంత మందగించింది. రాష్ట్రంలోని మంత్రు లు, ఎమ్మెల్యేలకు ఎన్నికల విధులు అప్పగించినా నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 15న మునుగోడుకు రావాల్సిన అధికారపార్టీ దిగ్గజాల కార్యక్రమం వాయిదాపడింది.

టీఆర్‌ఎస్‌కు జలక్‌

బీజేపీలోకి జంప్‌ అయిన చండూరు జడ్పీటీసీ 

వలసలకు బ్రేక్‌ వేసేందుకు పకడ్బందీ చర్యలు 

కర్నాటి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన టీఆర్‌ఎ్‌స నేతలు 

కూసుకుంట్ల అభ్యర్థిత్వం ప్రకటనపై ప్రభావం 

హైటెక్‌ హంగులతో మునుగోడులో రాజగోపాల్‌ క్యాంపు కార్యాలయం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె స్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మొదట్లో హడావుడి చేసినా నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక ల సందడి కొంత మందగించింది. రాష్ట్రంలోని మంత్రు లు, ఎమ్మెల్యేలకు ఎన్నికల విధులు అప్పగించినా నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 15న మునుగోడుకు రావాల్సిన అధికారపార్టీ దిగ్గజాల కార్యక్రమం వాయిదాపడింది. ఫిరాయింపుల్లోనూ కొంత స్తబ్ధత వచ్చిందని అంతా అంచనా వేసుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనదైనశైలి లో టీఆర్‌ఎ్‌సకు జలక్‌ ఇచ్చారు. టీఆర్‌ఎ్‌సకు నమ్మినబంటుగా ఉంటున్న చండూరు జడ్పీటీసీని బీజేపీలోకి చేర్చుకోవడంతో అంతా అవాక్కయ్యారు. 


మంత్రి జగదీ్‌షరెడ్డి, పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసిమెలిసి చండూరు జడ్పీటీ సీ వెంకటేశం తిరిగారు. ఏడాదికాలంగా నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో అత్యధిక శాతం మంది కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్నారు. అందుకు భిన్నంగా వెంకటేశం పార్టీ పెద్దలకు అండగా ఉండడమే కాదు టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలపై మాటల తూటాలు పేల్చేవారు. ‘హైదరాబాద్‌లో పైరవీలు, రియల్‌ఎస్టేట్‌ దందాలు చేసుకుంటూ అక్క డే ఉంటూ ఉప ఎన్నిక అనగానే నియోజకవర్గంలో తిరుగు తూ పార్టీ నేతలకు బిస్కెట్లు వేస్తూ, ఫిరాయింపులను ప్రో త్సహిస్తున్న కర్నాటి విద్యాసాగర్‌, కర్నె ప్రభాకర్‌, డాక్టర్‌ బూ ర నర్సయ్యగౌడ్‌ వంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయా లి’ అంటూ గత కొద్ది రోజుల క్రితం చండూరు మండలకేంద్రంలో మంత్రి జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మాట్లాడారు. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రే రాజగోపాల్‌రెడ్డి పంచన చేరడంతో అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కీలకనేతలు షాక్‌కు గురయ్యారు. గట్టుప్పల్‌ మండల డిమాండ్‌తో కర్నాటి వెంకటేశం కాంగ్రె్‌సనుంచి టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఆయనకు ఇచ్చిన మాట మేర కు మండలాన్ని అధికారికంగా ఖరారు చేశారు. అయినా వాటన్నింటినీ పక్కనబెట్టి వెంకటేశం పార్టీని వీడిపోయారు. ఆయనతో పాటు ఇప్పటికే గట్టుప్పల్‌ మండలంలో ఉన్న ఇద్దరు ఎంపీటీసీలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇంకా ఎంత మంది ఏమార్గంలో వెళ్తారో? ఎవరిని విశ్వసించాలో? సొంత పార్టీలోని కీలక నేతల్లో ఎంత మంది కోవర్టులు ఉన్నారో? అన్న ఆందోళన కీలక నేతలను పట్టిపీడిస్తోంది. 


వలసలకు బ్రేక్‌ వేసేందుకు 

ఊహించని పరిణామం ఎదురుకావడం, నష్టనివారణకు టీఆర్‌ఎస్‌ పెద్దలు చర్యలు చేపట్టారు. వెంకటేశం మాదిరిగా మరికొంత మంది వెళ్లకుండా ఉండేందుకు మానసికంగా పైచెయి సాధించేందుకు గట్టుప్పల్‌లో బుధవారం జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ వైస్‌ ఎంపీపీ అవ్వారు శ్రీనివాస్‌, గట్టుప్పల్‌ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్‌, ఉడతలపల్లి ఉపసర్పంచ్‌ తులసయ్యల దిష్టిబొమ్మలకు శవయాత్ర పెద్దఎత్తున కార్యాకర్తలతో నిర్వహించారు. వారి ప్లెక్సీలతో టీఆర్‌ఎస్‌ నేతలు కండువాలు కప్పుకుని దిష్టిబొమ్మల శవయాత్రలో పాల్గొన్నారు. స్థానికులను పెద్దఎత్తున భాగస్వామ్యులను చేశారు. ఓవైపు చండూరులో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుండగా మరోవైపు గట్టుప్పల్‌లో శవయాత్ర నిర్వహించారు.ఏడాదిన్నరగా నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నేరుగా యుద్ధానికి దిగుతున్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డిని నేరుగా కలుస్తూ ఆయన చేతుల మీదుగానే చేరికల కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గతంలో ఏర్పాటుచేశారు. బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీ బూ ర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కర్నాటి విద్యాసాగర్‌, నారబోయిన రవికుమార్‌ తనకు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తానంటూ కంచర్ల కృష్ణారెడ్డిలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వారందరినీ నియోజకవర్గానికి దూరంగా పార్టీ నేతలు పెట్టారు.సీఎం కార్యాలయం నుంచి తమకు సమాచారం లేదు,ప్రగతి భవన్‌ నుంచి వచ్చే ఆదేశాలనే తాము పాటిస్తాం తప్ప ఎవరిని ఇబ్బందిపెట్టే ఆలోచన లేదని జిల్లా నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. 


దిష్టిబొమ్మకు శవయాత్రపై న్యాయపోరాటం

గట్టుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు బుధవారం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించడంపై జడ్పీటీసీ వెంకటేశం తీవ్రంగా పరిగణించినట్లు సమాచా రం. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఇడెం కైలా సం, ఆయన కుమార్తెలు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల ని రాజగోపాల్‌రెడ్డి సూచన మేరకు వెంకటేశం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరో ప్రజాప్రతినిధిపై ఈతరహా చర్యలు చేపట్టడం ఏమిటి, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న ఇడెం కుటుంబసభ్యుల దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించడం తనకు పెద్ద సమస్య కాదని అధికార పార్టీకి తెలిసిరావాలం టే న్యాయ పోరాటమే మార్గమని వెంకటేశం నిర్ణయించిన ట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల పార్టీ ఫిరాయించిన నేతల సమాచారం, ఫొటోలు తెప్పించి వారికి లేని నిరసనలు కేవలం తన ఒక్కడి దిష్టిబొమ్మకే శవయాత్ర ఏమిటన్న అంశంపై కోర్టుమెట్లు ఎక్కనున్నట్లు సమాచారం. కాంగ్రె్‌సకు రాజీనామా చేయకుండా మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని, రాబో యే మూడు, నాలుగు రోజుల్లో తన కార్యాచరణ చేపట్టనున్నట్లు వెంకటేశం తెలిపారు. 


హైటెక్‌ హంగులతో మునుగోడులో రాజగోపాల్‌ క్యాంపు కార్యాలయం

మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితానికి సవాల్‌గా మారడంతో ఎందాకైనా అన్నట్లు రాజగోపాల్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి స్థానికంగా అందుబాటులో లేరన్న ప్రచారానికి బ్రేక్‌వేయడంతోపాటు రాబోయే రోజుల్లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు మునుగోడులోనే మకాంవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు మునుగోడు మండల కేంద్రంలో చండూరు రోడ్డులో రెండున్నర ఎకరాల స్థలంలో హైటెక్‌ హంగులతో రాజగోపాల్‌రెడ్డి తాత్కాలిక నివాసాన్ని సిద్ధంచేసుకుంటున్నారు. ఒక దేవుడి మందిరం, మూడు బెడ్‌రూంలు, ఒక వంటగది, ఒక డైనింగ్‌, ఒక వెయిటింగ్‌ హాలు నిర్మాణం చురుకుగా సాగుతోంది. గత రెండు వారాలుగా సుమారు 50మంది పనివాళ్లు స్థానికంగా మకాం వేశారు. రోజు 1000 మంది భోజనం చేసేలా నిర్మాణాలు చేపడుతున్నారు. 


ఒక్కరు చేజారినా ప్రమాదమే.. 

కూసుకుంట్లను ఖరారు చేస్తే ఈ ఆ శావహుల్లో ఏ ఒక్కరూ చేజారినా ప్రమాదమేనని, చేజారే అవకాశం కూడా ఉందని ప్రచారం జరిగింది. ఈ అంచనాలకు భిన్నంగా కర్నాటి వెంకటేశం పార్టీ మారడం కొన్ని రోజుల క్రితమే చండూరు మండలానికి చెందిన ఆయన అనుచరులుగా పేర్కొనే కొంతమంది ప్రజాప్రతినిధులు రాజగోపాల్‌రెడ్డి పంచన చేరడం చకచకా పూర్తయ్యాయి. వెంకటేశం పార్టీని వీడుతారంటూ వారంరోజుల క్రితమే నియోజకవర్గంలో నారబోయిన రవికుమార్‌ పార్టీ పెద్దలకు సూచించినట్లు సమాచారం. ఫిరాయిస్తారనుకున్న వారు సహనం వహిస్తుండగా పక్కన ఉన్న వారు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో నియోజకవర్గ ఓటర్లకు, కార్యకర్తలకు మంచి భోజనం, ఆట, పాటలతో వినోదాన్ని పంచుతున్నా రు. పార్టీ గుర్తును, సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రచారంచేస్తున్నారు. సీఎం సూచనల మేరకు పకడ్భందీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. ఆశావహులు శాంతించారు. ఈ సమ్మేళనాల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి జగదీ్‌షరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు మాత్రమే ప్రసంగిస్తున్నారు. సవ్యంగా సాగుతుందనుకుంటున్న క్రమంలో ఫిరాయింపులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇక కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే వాతావరణం నెలకొంది అనుకున్న సమయంలో ఫిరాయింపులు అభ్యర్థి ప్రకటన అంశంపై ప్రభావం చూపిస్తున్నాయి. 


ఫిరాయింపులు ప్రోత్సహించే వారికి సస్పెండ్‌ చేయాలి : కర్నాటి వెంకటేశం 

 ‘హైదరాబాద్‌లో పైరవీలు, రియల్‌ఎస్టేట్‌ దందాలు చేసుకుంటూ అక్కడే ఉంటూ ఉప ఎన్నిక అనగానే నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ నేతలకు బిస్కెట్లు వేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కర్నాటి విద్యాసాగర్‌, కర్నె ప్రభాకర్‌, డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ వం టి వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’ 



మంత్రి జగదీశ్‌రెడ్డి బీసీలను అణగదొక్కుతున్నారు

చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆరోపణ

చండూరు, సెప్టెంబరు 21: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బీసీలను అణగదొక్కుతున్నారని చండూరు జెడ్పీటీ సీ కర్నాటి వెంకటేశం ఆరోపించారు. బీసీలంటే మంత్రికి గిట్టదని, ఆయన ప్రవర్తనతోనే తాను మనస్తాపానికి గురై టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. బుధవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే నియోజకవర్గ అభివృద్ధితోపాటు గట్టుప్పల మండలాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చి న మ్మించి మోసం చేశారని ఆరోపించారు. గట్టుప్పల మండల గెజిట్‌ ఇప్పించినా నేటికీ పాలనా సౌలభ్యానికి అనుమతులు ఇప్పించలేదన్నారు. గట్టుప్పల ప్రజలను నమ్మించడానికే డ్రామా ఆడారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఉన్న దళిత,బీసీలపై వివక్ష చూపుతున్నారన్నారు.మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై గతంలో మంత్రి తన నివాసంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తే, నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్‌ ఇవ్వాలని సమావేశంలో పాల్గొ న్న ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలు ముక్తకంఠంతో అభిప్రాయాలను మంత్రి దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నవారే మంత్రి వైఖరిని వ్యతిరేకిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వెంట వేసుకుని ఒంటరివారయ్యారన్నారు. నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు అధిక శాతం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తనలాంటి వారు పోటీకి వస్తారనే అనుమానంతోనే తనను దూరం పెట్టారన్నారు. నియోజకవర్గంలోని గ్రా మపంచాయతీలకు ఎఫ్‌డీఎఫ్‌ నిధులు రాకుండా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అడ్డుకొని అభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేకు ప్రొటోకాల్‌ ఇవ్వకుండా అధికారులను బెదిరించి, తన స్థాయిని మరిచి అతిగా జోక్యం చేసుకోవ డంతోనే ఉపఎన్నికకు దారితీసిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా బీసీలను అణగదొక్కడానికి తన పెత్తనాన్ని చెలాయిస్తూ ఏకచక్రాధిపత్యానికి పరిమితమయ్యారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న సీనియర్‌ నాయకులను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఒంటెద్దు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టించారని అన్నారు. బీసీ సా మాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ లాంటి నేతలను పక్కనబెట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ తనకు టెక్సో చైర్మన్‌ పదవిని ఇస్తానంటే రాకుండా మంత్రి అడ్డుకున్నారని కర్నాటి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడికి ఆ పదవి కట్టబెట్టారన్నారు. 

Updated Date - 2022-09-22T05:39:41+05:30 IST