తుఫాన్‌ వర్షాలతో జలాశయల్లోకి వరద

ABN , First Publish Date - 2020-11-28T06:14:28+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని సాగునీటి రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం పెరిగింది.

తుఫాన్‌ వర్షాలతో జలాశయల్లోకి వరద
రైవాడ జలాశయం


రైవాడ రిజర్వాయర్‌లోకి 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

చోడవరం, నవంబరు 27: తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని సాగునీటి రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరువలో వున్న జలాశయాలు... పూర్తిగా నిండే అవకాశం వుందని ఇరిగేషన్‌ అధికారులు భావిస్తున్నారు. రైవాడ రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 112.70 మీటర్లు వుంది. కోనాం నీటిమట్టం 101.25 మీటర్లుకాగా 20 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 99 మీటర్లు వుంది. పెద్దేరు నీటిమట్టం 137 మీటర్లుకాగా 67 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 136.45 మీటర్లు, కళ్యాణపులోవ నీటిమట్టం 465 అడుగులుకాగా 40 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 457 అడుగులు వుంది    


Updated Date - 2020-11-28T06:14:28+05:30 IST