మార్చిలోగా ఇంటింటికీ కుళాయి

ABN , First Publish Date - 2020-12-04T07:04:58+05:30 IST

వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి అందిస్తారని జాతీయ జలజీవన్‌ మిషన్‌ బృందం ప్రతినిధులు అబ్జల్‌ ఖాన్‌, మురళీధర్‌ తెలిపారు.

మార్చిలోగా ఇంటింటికీ కుళాయి

మోపిదేవి : వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి అందిస్తారని జాతీయ జలజీవన్‌ మిషన్‌ బృందం ప్రతినిధులు అబ్జల్‌ ఖాన్‌, మురళీధర్‌ తెలిపారు.  జలజీవన్‌ మిషన్‌ బృందం సభ్యులు మోపిదేవి పంచాయతీలో పర్యటించారు.   గంజివానిపాలెంలో గ్రామస్థులతో సమావేశమై మంచినీటి వసతిపై ఆరా తీశారు.   రావివారిపాలెం, బోడగుంట, ప్రజాశక్తినగర్‌ కాలనీల్లో కొంతమేర కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని, కొద్దిరోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు.   ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సాయినాథ్‌, ఈఈ కె.వెంకటేశ్వరరావు, డీఈ బెనహర్‌, పంచాయతీ ప్రత్యేకాధికారిణి కె.అరుణకుమారి, కార్యదర్శి కె.త్రిపుర సుందరి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T07:04:58+05:30 IST