రేకల చేనులో సందడిగా జల్లికట్టు

ABN , First Publish Date - 2021-01-17T19:35:21+05:30 IST

జిల్లాలోని రేకల చేనులో అంగరంగ వైభవంగా జల్లికట్టు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో జల్లికట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

రేకల చేనులో సందడిగా జల్లికట్టు

తిరుపతి: జిల్లాలోని రేకల చేనులో అంగరంగ వైభవంగా జల్లికట్టు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో జల్లికట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోటీలను చూడడానికి మల్లయ్యపల్లె, చానంబట్ల, రంగంపేట, చంద్రగిరి, అనుప్పల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సుమారు 300 నుంచి 400 వరకు కోడె గిత్తలను నిర్వాహకులు పోటీల్లోకి దింపారు. యువత కేరింతల నడుమ పరుష పందాలు జోరుగా సాగాయి. ఉరకలేస్తూ దూసుకుపోయిన కోడె గిత్తలను నిలువరించేందుకు యువత ఉత్సాహంతో రంగంలోకి దిగారు. కోడె గిత్తలను నిలువరించేందుకు యువత తీవ్ర ప్రయత్నాలు చేశారు.  ఈ పోటీలను  ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కోడె గిత్తలను కట్టడి చేసేందుకు ప్రయత్నించిన కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. రంకెలేస్తూ వస్తున్న పశువులను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పోటీల్లో యువతి యువకులు సందడిగా గడిపారు. 

Updated Date - 2021-01-17T19:35:21+05:30 IST