బొప్పరాజుపల్లెలో జల్టికట్టు

ABN , First Publish Date - 2020-11-23T07:14:31+05:30 IST

రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లె పంచాయతీ బొప్పరాజుపల్లెలో సంక్రాంతికి ముందే కోడెగిత్తలు రంకేశాయి.

బొప్పరాజుపల్లెలో జల్టికట్టు
కోడెగిత్తను నిలువరిస్తున్న యువత

రామచంద్రాపురం, నవంబరు 22: రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లె పంచాయతీ బొప్పరాజుపల్లెలో సంక్రాంతికి ముందే కోడెగిత్తలు రంకేశాయి. ఆదివారం కోడెగిత్తలను గ్రామశివార్లలో అలంకరించి.. నడివీధి అల్లె వద్దకు గ్రామస్తులు తీసుకొచ్చారు. అక్కడ వాటికి పూజలు చేసి.. విలువైన బహుమతులను కొమ్ములకు కట్టి అల్లెలోకి వదిలారు. యువకులు జట్లుగా ఏర్పడి.. కోడెగిత్తలను నిలువరించి, బహుమతులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. జల్టికట్టును తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారికి మధ్యాహ్న భోజన వసతిని స్థానికులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-23T07:14:31+05:30 IST