ఎర్రుపాలెం, జూలై 7: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నూతన ఈవోగా కొత్తూరు జగన్మోహన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఈవో జగన్మోహన్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన పి.ఉదయ్‌భాస్కర్ ఉద్యోగోన్నతిపై సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల వెంకటజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివా్‌సశర్మ, జిల్లా అర్చక ఉద్యోగులసంఘం నాయకులు డి.వీరభద్రశర్మ, తోటకూర వెంకటేశ్వర్లు, రఘునాథాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.