weekends: గుల్‌మార్గ్‌లోకి పర్యాటకుల అనుమతిపై నిషేధం

ABN , First Publish Date - 2021-07-16T15:36:38+05:30 IST

జమ్మూకశ్మీరులోని గుల్‌మార్గ్‌లో కరోనా కట్టడి కోసం బారాముల్లా జిల్లా మెజిస్ట్రేట్ భూపిందర్ కుమార్ సంచలన ఉత్తర్వులు...

weekends: గుల్‌మార్గ్‌లోకి పర్యాటకుల అనుమతిపై నిషేధం

గుల్‌మార్గ్‌ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని గుల్‌మార్గ్‌లో కరోనా కట్టడి కోసం బారాముల్లా జిల్లా మెజిస్ట్రేట్ భూపిందర్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. వీకెండ్సులో గుల్‌మార్గ్‌లోకి పర్యాటకుల అనుమతిని నిషేధిస్తూ జిల్లా మెజిస్ట్రేట్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 34 ప్రకారం వారాంతపు రోజుల్లో పర్యాటక ప్రాంతమైన గుల్ మార్గ్ లోకి పర్యాటకులను అనుమతించవద్దని కుమార్ అధికారులను ఆదేశించారు.మాస్కులు లేకుండా వచ్చే పర్యాటకులకు వెయ్యిరూపాయల జరిమానా విధించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.


 జమ్మూకశ్మీరులో ప్రస్థుతం 2,236 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. శని,ఆదివారాల్లో పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించిన సర్కారు టీకాలు వేయించుకున్న వ్యక్తులు, ఆర్టీపీసీఆర్ ప్రతికూల రిపోర్టు ఉన్నవారికి మాత్రమే గుల్ మార్గ్ లోకి ప్రవేశించవచ్చని మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. ప్రఖ్యాత స్కీ రిసార్టులోకి  పర్యాటకులు ఆర్టీపీసీఆర్ ప్రతికూల రిపోర్టు, టీకాలు వేయించుకున్న వారినే అనుమతించాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2021-07-16T15:36:38+05:30 IST